Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమన్‌లో షహీన్‌ తుఫాను బీభత్సం: ప్రపంచకప్ సంగతేంటి?

ఒమన్‌లో షహీన్‌ తుఫాను బీభత్సం: ప్రపంచకప్ సంగతేంటి?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (20:50 IST)
Oman Rains
టీ20 ప్రపంచకప్‌కు ఆతిధ్య దేశమైన ఒమన్‌లో షహీన్‌ తుఫాను బీభత్సం సృష్టించింది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాలతో దేశ రాజధాని మస్కట్‌ సహా చుట్టు పక్క ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దాంతో ఈ ప్రభావం ఇక్కడ త్వరలో జరగాల్సిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉంది. 
 
క్వాలిఫయర్స్‌ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌) జట్ల మధ్య రౌండ్ 1 మ్యాచ్ లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. 
 
ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో ఆరు రౌండ్‌-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది. మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ ముందే.. భారత జట్టుకు భారీ షాక్..