ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌పై మొన్నటికి మొన్న సంచలన విజయం సాధించిన ఆప్ఘనిస్థాన్.. న్యూజిలాండ్ చేతిలో ఖంగుతింది. ఇంగ్లండ్‌పై గెలిచిన ఊపుతోనే.. కివీస్‌పై గెలవాలనుకుంది. అయితే ఆ ఆశలు నిరాశగా మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో ఈ మ్యాచ్ బరిలో దిగిన ఆప్ఘనిస్థాన్ 149 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.
కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. శాంట్నర్‌కు 3, బౌల్ట్‌కు 2, మాట్ హెన్రీ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. ఆఫ్ఘన్ జట్టులో రహ్మత్ షా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. ఆప్ఘన్ బ్యాటర్స్ రాణించకపోవడంతో ఆ జట్టు కివీస్ చేతిలో ఓడింది.