Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిక్కుల్లో పడిన సాక్షి ధోనీ.. 420 కేసు నమోదు.. కెప్టెన్ ధోనీ రూ.100 కోట్ల రికార్డు ఎలా?

భారత వన్డే ఫార్మాట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ చిక్కుల్లో పడ్డారు. తనకు రావాల్సిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశారంటూ డెనిస్ అరోరా అనే వ్యక్తి గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత

చిక్కుల్లో పడిన సాక్షి ధోనీ.. 420 కేసు నమోదు.. కెప్టెన్ ధోనీ రూ.100 కోట్ల రికార్డు ఎలా?
, సోమవారం, 10 అక్టోబరు 2016 (17:42 IST)
భారత వన్డే ఫార్మాట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ చిక్కుల్లో పడ్డారు. తనకు రావాల్సిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశారంటూ డెనిస్ అరోరా అనే వ్యక్తి గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాక్షి ధోనీపై 420 కేసును నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ ఎంఎస్ డి అల్మోడ్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థకు సాక్షితో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సంస్థకు 'స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్' అనే సంస్థలో షేర్లు ఉన్నారు. అయితే, ముగ్గురు భాగస్వాముల్లో ఒకరైన డెనిస్ అరోరా స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్‌లో తనకున్న 39శాతం షేర్లను అమ్మేయాలని నిర్ణయించుకోవడంతో వీటికి బదులుగా రూ.11కోట్లు ఇస్తామని సాక్షితో పాటు మరో భాగస్వామి ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ సంతకమే ప్రస్తుతం ధోనీ భార్యకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ మొత్తాన్ని ఇవ్వకుండా షేర్లు అమ్ముడు పోవడంతో సాక్షి ధోనీపై కేసు నమోదైంది. 
 
ఇదిలా ఉంటే.. సిల్వర్ స్క్రీన్‌పై టీమిండియా కెప్టెన్ ధోనీ రికార్డులు సృష్టిస్తున్నాడు. తన జీవితకథ ఆధారంగా రూపొందిన 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వసూళ్లలో వంద కోట్ల మార్కును దాటింది. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైంది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లో రూ. 103.4 కోట్లు వసూలు చేసిందని సినీ నిర్మాతలు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోర్ మ్యాచ్: రహానే, అశ్విన్‌ అదుర్స్.. 276 పరుగుల ఆధిక్యంలో భారత్..