Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండోర్ మ్యాచ్: రహానే, అశ్విన్‌ అదుర్స్.. 276 పరుగుల ఆధిక్యంలో భారత్..

ఇండోర్‌లో భారత్-కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగులు సాధించడంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే పాత్ర వెలకట్టలేనిది. 381 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్పర్ల సాయంతో 188 ప

Advertiesment
India bat after Ashwin six-for secures 258-run lead
, సోమవారం, 10 అక్టోబరు 2016 (17:11 IST)
ఇండోర్‌లో భారత్-కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో  557 పరుగులు సాధించడంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే పాత్ర వెలకట్టలేనిది. 381 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్పర్ల సాయంతో 188 పరుగులు సాధించాడు. అయితే డబుల్ సెంచరీని స్వల్ప దూరంలో కోల్పోయిన రహానే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. తద్వారా భారత్ 276 పరుగులతో ఆధిక్యంలో నిలిచింది. 
 
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు కనిపించాయి. ఈ క్రమంలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అతనికి జడేజా అద్భుతమైన సహకారం అందించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 258 పరుగులు వెనుకబడి తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
 
వీలైనన్ని ఎక్కువ పరుగులు స్కోరు బోర్డుపై ఉంచి రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని టీమిండియా భావిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగగా, అతనికి దీటుగా రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టులో గుప్తిల్ (72), లాంథమ్ (53), నీషమ్ (71) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ వాటిని భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు కేవలం 299 పరుగులకే ఆలౌట్ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ డబుల్ సెంచరీ.. రెహానే శతకం : భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 557/5 రన్స్