Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిత్ ధమాకా: ఐదో వన్డేలో భారత్ ఘన విజయం .. అగ్రస్థానం..

ఐసీసీ ర్యాంకుల పట్టిక అగ్రస్థానంలో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన పోరులో భారత్ సత్తాచాటింది. ఆస్ట్రేలియాతో ఆఖరిదైన ఐదో వన్డేలో అక్షర్, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీత

రోహిత్ ధమాకా: ఐదో వన్డేలో భారత్ ఘన విజయం  .. అగ్రస్థానం..
, సోమవారం, 2 అక్టోబరు 2017 (07:15 IST)
ఐసీసీ ర్యాంకుల పట్టిక అగ్రస్థానంలో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన పోరులో భారత్ సత్తాచాటింది. ఆస్ట్రేలియాతో ఆఖరిదైన ఐదో వన్డేలో అక్షర్, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో విజృంభించడంతో కోహ్లీసేన భారీ గెలుపును సొంతం చేసుకున్నది. దక్కినట్లే దక్కి చేజారిన నంబర్‌వన్ ర్యాంక్‌ను మళ్లీ ఒడిసిపట్టుకుంది. 
 
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చివరిదైన ఐదో వన్డే నాగ్‌పూర్ వేదికగా జరిగింది. ఈ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై భారత్ విజయం సాధించింది. 42.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 243 పరుగులు చేసింది.
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును అక్షర్ పటేల్ (3/38), బుమ్రా (2/51)లు కట్టడి చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 242/9 స్కోరు చేశారు. వార్నర్(53) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, హెడ్ (42), స్టోయినిస్ (46) రాణించారు.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యంతో నిలిచి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ధోనీ సేన నిలిచినట్టయింది.
 
సెంచరీతో కదంతొక్కిన రోహిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన హార్దిక్ పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 'లభించింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈనెల 7న రాంచీలో మొదలవుతుంది. 
 
కాగా, భారత ఇన్నింగ్స్‌లో స్టైలిష్ బ్యాట్స్‌మన్ రోహిత్ మరో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైకర్ రహానేతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. ఆదిలో పరుగుల ఖాతా తెరువడానికి 15 బంతులు తీసుకున్నా.. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లను కంగారెత్తించాడు. ఏకంగా 125 పరుగులు చేశాడు. అలాగే, రహానే అండగా చూడచక్కని షాట్లతో అలరిస్తూ లక్ష్యాన్ని కరిగించాడు. 
 
ఈ క్రమంలో తొలి వికెట్‌కు రహానే జతగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరికి వరుసగా ఇది మూడో సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్న దశలో రహానే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ (39).. రోహిత్ కలిసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అయితే జంపా ఓవర్లో ఈ ఇద్దరు వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖర్లో జాదవ్ (5 నాటౌట్), మనీశ్‌పాండే (11 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్