భారత జట్టులో ధోని తిరిగి చోటు దక్కించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అతని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజాన్ బెనర్జీ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోనీ టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే కానీ చివరగా ఒక్క చాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నాడు.
ఐపీఎల్‌తో తిరిగి సత్తా చాటుకుని జట్టులోకి రావాలని చూసిన ధోనికి నిరాశే ఎదురైందని గుర్తు చేశాడు. ఐపీఎల్ కోసం ముందుగానే ప్రాక్టీస్ మొదలు పెట్టేసినా ఆ లీగ్ వాయిదా పడటంతో ధోని ఆశలు నిరాశగా మారిపోయే అవకాశం వుందని చెప్పుకొచ్చాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ జరుగుతుందనే విషయంపై కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌తో భారత జట్టులో తిరిగి రావాలని ధోని చూశాడని, ఆ టోర్నీ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంలో పడిన తరుణంలో ధోనీకి జాతీయ జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. కాకపోతే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)..ధోనికి చివరగా ఒక అవకాశం ఇచ్చి చూస్తుందన్నాడు. అది కూడా టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చివరి అవకాశం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.