Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదేళ్ల ఒప్పందం ముగిసినా ధోనియే మా కెప్టెన్.. నిజమైన యాజమాన్యం అంటే అదే మరి

భారత క్రికెట్ చరిత్రలో అప్రతిహత విజయాలను సాధించిపెట్టిన అద్భుత కెప్టెన్ అతడు. మహేంద్ర సింగ్ ధోనీ కాదు మహేంద్ర బాహుబలి అంటూ కోట్లమంది జనం, అభిమానులు ప్రేమగా, అభిమానంతో, గౌరవంతో తనను పిలుచుకుంటున్నారు. తాను చేయని పొరపాటుకు ఐపీఎల్‌లో సొంత గూడు వదిలి రెం

పదేళ్ల ఒప్పందం ముగిసినా ధోనియే మా కెప్టెన్.. నిజమైన యాజమాన్యం అంటే అదే మరి
హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (08:03 IST)
భారత క్రికెట్ చరిత్రలో అప్రతిహత విజయాలను సాధించిపెట్టిన అద్భుత కెప్టెన్ అతడు. మహేంద్ర సింగ్ ధోనీ కాదు మహేంద్ర బాహుబలి అంటూ కోట్లమంది జనం, అభిమానులు ప్రేమగా, అభిమానంతో, గౌరవంతో తనను పిలుచుకుంటున్నారు. తాను చేయని పొరపాటుకు ఐపీఎల్‌లో సొంత గూడు వదిలి రెండేళ్లుగా పరాయి టీమ్‌కు కేప్టెన్‌ అయ్యాడు. గ్రహపాటో, జట్టు కూర్పు పొరపాటో తెలియదు కానీ తాను ఆడుతున్న పుణే రైజింగ్ సన్ జట్టు విజయాల బాట పట్టలేదు.

తొలి సంవత్సరం అనుకున్న ఫలితాలు రాలేదని ఆగ్రహించిన టీమ్ యాజమాన్యం తనకు చెప్పా పెట్టకుండా కెప్టెన్ షిప్ నుంచి తొలిగించేసింది. పైగా అడవికి రాజు మరొకరుండగా ఇతనెందుకు అంటూ ఆవమానకరంగా వ్యాఖ్యానించింది. దాంతో అభిమానులు అగ్గయిపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా టీమ్ ఫ్రాంచైజ్‌పై విరుచుకుపడ్డారు. ధోనీ గొప్పతనం మాకెందుకు తెలీదు అంటూ యాజమాన్యమే వెనుకడుగు వేసేంతవరకు వదల్లేదు. 
 
అలాంటిది చెన్నై సూపర్ కింగ్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలతో విధించిన రెండేళ్ల నిషేధం తొలగిపోయింది. ఆయా జట్లతో 10 ఏళ్ల ఐపీఎల్ ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. వచ్చే ఐపీఎల్‌పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ... 'కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. అయితే ఓ ఆటగాడిని కచ్చితంగా పాత జట్టు తీసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిని తీసుకుంటాం. ఈ ఏడాది పుణెతో ధోని కాంట్రాక్టు ముగుస్తుంది. జట్టును ముందుకు నడిపించే సమర్థవంతమైన వ్యక్తి ధోని. ఆయనపై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా ధోనిని, ప్రధాన కోచ్‌గా స్టీవెన్‌ ఫ్లెమింగ్‌ను తీసుకోవాలని ఫ్రాంచైజీ యోచిస్తోంది. త్వరలో మేనేజ్‌మెంట్ విషయంపై చర్చిస్తామని' వెల్లడించారు.

అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గానూ రికార్డు ధోని సొంతం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టనున్నాయి. 2015లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ కారణంగా 2016, 2017 సీజన్లలో ఈ జట్లు ఆడలేదు. వీటి స్థానాల్లో గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ వచ్చి చేరినా వాటి రెండేళ్ల కాంట్రాక్టు కాలం పూర్తవడంతో ఆ జట్లు రద్దయ్యాయి. మరోవైపు గురువారంతో చెన్నై, రాజస్థాన్ జట్లపై విధించిన నిషేధం గడువు ముగిసిపోయింది. ఈ విషయాన్ని చెన్నై ఐపీఎల్ జట్టు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
Chennai Super Kings ✔ @ChennaiIPL
Not just @msdhoni! #CSKReturns 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చావుకబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనా గంగూలీ.. ఐదు నెలల కోచ్‌పై ఇంత రగడ ఎందుకు?