Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిన్నీతో వుండకు.. విడాకులు ఇచ్చేయ్.. సూసైడ్ చేసుకో: నెటిజన్ల ఓవరాక్షన్

క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. పరుగులు తీస్తే ప్రశంసలు... లేకుంటే విమర్శలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీకి కష్టాలు తప్పట్లేదు. మొన్న విండీస్‌తో జరిగిన తొలి ట

Advertiesment
Mayanti Langer Slams Trollers Targetting Husband Stuart Binny
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (11:22 IST)
క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. పరుగులు తీస్తే ప్రశంసలు... లేకుంటే విమర్శలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీకి కష్టాలు తప్పట్లేదు. మొన్న విండీస్‌తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో బిన్నీ 32 పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్టువర్ట్ బిన్నీపై విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సోషల్ మీడియాను ఓపెన్ చేయాలంటేనే బిన్నీ జడుసుకుంటున్నాడు. 
 
ఈ ఎపిసోడ్‌లో బిన్నీ భార్యా యాంకర్ మాంటి లంగర్‌‌ని కూడా వదలి పెట్టలేదు. డబ్బు కోసం బన్నీని చేసుకున్నావా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా "బిన్నీతో వుండకు? విడాకులు ఇచ్చేయ్.. లేదంటే సూసైడ్ చేసుకో'' ఇలాంటి దారుణమైన ట్వీట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి విమర్శలు చేసే నెటిజన్లపై బిన్నీ సన్నిహితులు, స్నేహితులు మండిపడుతున్నారు. 
 
అయితే నెటిజన్ల ఓవరాక్షన్‌పై మాంటి లంగర్ ఘాటుగా స్పందించింది. "సూసైడ్ చేసుకోమని చెప్పడం సిగ్గు చేటు. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు మీవారి ప్రేమ దక్కాలని కోరుకుంటున్నా" అంటూ లాంగర్ యాన్సర్ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ క్రికెట్ తరహాలో సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్.. అమలాపాల్ ఎందుకొచ్చినట్టు?