Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్ క్రికెట్ తరహాలో సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్.. అమలాపాల్ ఎందుకొచ్చినట్టు?

ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్, అమలా పాల్ వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. వీరి వైవాహిక జీవితం తెగతెంపులయ్యేందుకు ఎవరైనా కారణం కావచ్చు. అయితే అమలా పాల్‌పైనే మీడియా, సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోశా

Advertiesment
CBL( Celebrity Badminton League ) Press Meet 2016
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (14:03 IST)
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్, అమలా పాల్ వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. వీరి వైవాహిక జీవితం తెగతెంపులయ్యేందుకు ఎవరైనా కారణం కావచ్చు. అయితే అమలా పాల్‌పైనే మీడియా, సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోశాయి.

అమలాపాల్ వ్యక్తిగత వ్యవహారాన్ని సోషల్ మీడియా, ఆన్ లైన్ మీడియా రోడ్డుకీడ్చాయి. అయితే ఇలాంటి ఆరోపణలకు సాధారణంగా మహిళలు కుమిలిపోతారు. కానీ అమలా పాల్ మాత్రం విమర్శలను ధీటుగా ఎదుర్కొంది. తనపై ఎన్ని విమర్శలొచ్చినా.. ఏమాత్రం పట్టించుకోకుండా.. నిలదొక్కుకుంది. 
 
ఇంకా సినీ ప్రోగ్రామ్‌లకు, షూటింగ్‌లకు ఆసక్తిగా పాల్గొంటోంది. తాజాగా చెన్నైలో జరిగిన సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. స్టార్ క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ లీగ్ పోటీల్లో చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరులలో జరుగుతోంది. ఫైనల్ పోటీలు మలేషియా రాజధాని కోలాలంపూర్‌లో జరుగుతోంది. ఇందులో చెన్నై తరపున ఆడే క్రీడాకారులను పరిచయం చేసే కార్యక్రమంలో చెన్నైలో జరిగింది.
 
ఈ జట్టు కెప్టెన్‌గా ఆర్య ఎంపికయ్యారు. భరత్, ప్రసన్న, అభినయ్ వట్టి వంటి సినీ తారలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ జట్టుకు యాడ్ అంబాసిడర్‌గా మాధవన్ వ్యవహరిస్తుండగా, జట్టుకు జోష్ నింపేందుకు అమలా పాల్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపాల్ నవ్వు ముఖంతోనే హాజరైంది. తన వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి అందరితో కలిసిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతి వివక్షకు గురైన యువరాజ్ సింగ్ కాబోయే భార్య.. ఇలాంటి మనుషులుంటారా?: హజల్ కీచ్