Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జట్టులో ఉండి ఏం లాభం.. అందుకే వైదొలుగుతా...

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు యమ జోరుమీద ఉంది. కోహ్లీ సేన విజృంభణకు లంకేయులు బిత్తరపోతున్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌లను కోల్పోయి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Advertiesment
జట్టులో ఉండి ఏం లాభం.. అందుకే వైదొలుగుతా...
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (19:06 IST)
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు యమ జోరుమీద ఉంది. కోహ్లీ సేన విజృంభణకు లంకేయులు బిత్తరపోతున్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌లను కోల్పోయి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంతగడ్డపై కూడా ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోతున్నారు. దీంతో శ్రీలంక క్రికెటర్లు తీవ్ర నిర్వేదంలో కూరుకునిపోయారు. అలాంటి వారిలో సీనియర్ పేసర్, కెప్టెన్ లసిత్ మలింగా. 
 
సొంత గడ్డపై భారత జట్టులో ఎదురైన వరుస వైఫల్యాలపై స్పందిస్తూ... భారత్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తన ప్రదర్శన సంతృప్తికరంగా లేకపోతే ఆటకు వీడ్కోలు పలకడమే బెటర్ అన్నాడు. గాయం కారణంగా 19 నెలల పాటు జట్టుకు దూరమయ్యానని... ఈ సిరీస్ తర్వాత ఎక్కడుంటానో చూద్దామన్నాడు. 
 
శరీరం సహకరిస్తే ఫర్వాలేదని... లేకపోతే జట్టులో ఉండిఏం ప్రయోజనమన్నాడు. ఫామ్‌‌ను అందిపుచ్చుకోలేక పోతే, సరిగ్గా బంతిని విసరలేకపోతే ఆటకు ఆనందంగా వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. భారత జట్టు చేతిలో వరుసగా ఎదురైన పరాజయాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలంబో వన్డే : 168 రన్స్ తేడాతో శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం