Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటమి భయంతో మధ్యలోనే చాప చుట్టేస్తున్నారు : మహేళ జయవర్ధనే

ఇటీవలి కాలంలో శ్రీలంక క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో టీమిండియా పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన లంక జట్టు.. ఆ తర్వాత ప్రారంభమైన వన్డే సిరీస్‌లో భాగంగ

ఓటమి భయంతో మధ్యలోనే చాప చుట్టేస్తున్నారు : మహేళ జయవర్ధనే
, గురువారం, 24 ఆగస్టు 2017 (06:46 IST)
ఇటీవలి కాలంలో శ్రీలంక క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో టీమిండియా పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన లంక జట్టు.. ఆ తర్వాత ప్రారంభమైన వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. 
 
దీనిపై ఆ జట్టు మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే మాట్లాడుతూ... ఓటమి భయమే శ్రీలంక క్రికెట్‌ జట్టు వరుస వైఫల్యాలకు కారణమన్నారు. టీమిండియాతో టెస్టుల్లో వైట్‌వాష్‌కు ముందే వన్డే సిరీస్‌లో పసికూన జింబాబ్వే చేతిలో లంకేయులు 2-3 తేడాతో ఓడిపోయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 
 
దంబుల్లా వన్డేలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆతిథ్య బృందం 216 స్కోరు వద్దే కుప్పకూలింది. ‘జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఓటమి భయం పెరిగింది. ఆటగాళ్లు ఆత్మస్థైర్యంతో కనిపించడం లేదు. మధ్యలోనే చాప చుట్టేస్తున్నారు. త్వరగా దీనికి పరిష్కారం కనుక్కోవాలి. టెస్టు సిరీస్‌ ప్రదర్శన పట్ల వారంతా నిరాశలో ఉన్నారు. నంబర్‌ వన్‌ జట్టుతో తమను తాము నిరూపించుకోవడం లంక ఆటగాళ్లకు సవాలే’ అని జయవర్ధనే అన్నారు. 
 
కోహ్లీ.. పాండ్యా సూపర్‌ టీమిండియా సారథి విరాట్‌కోహ్లీని జయవర్ధనే ప్రశంసించారు. ‘కోహ్లీ చురుగ్గా, దూకుడుగా ఉంటాడు. ఆటను చక్కగా ఆరంభిస్తాడు. ఎక్కువగా సొంత మైదానంలో ఆడినా అవీ గెలిచాడు. మైదానంలో, బయటా కుర్రాళ్లకు చక్కగా నాయకత్వం వహిస్తున్నాడు. అందరూ బాధ్యతలు పంచుకొనేలా కేంద్రంగా నిలిచాడు. అందుకే జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ స్థానాల కోసం పోటీ ఉంది. ఇక హార్దిక్‌ పాండ్యా ప్రతిభ అద్భుతం. అతడు 130-140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం సానుకూల అంశం. బ్యాటింగ్‌ నైపుణ్యం కూడా అంతే. సరైన సమయంలో భారీ షాట్లు ఆడగలడు. పాండ్యా జట్టుకు సమతూకం తెస్తున్నాడు’ అని జయవర్ధనే అభిప్రాయ పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రెస్సులో చెమట.. అబ్బే ఇబ్బందిగా లేదా?: మిథాలీకి ప్రశ్న.. ఏం చెప్పిందంటే?