Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో అత్యుత్తమ వికెట్ కీపర్ సాహానే.. కోహ్లీ మాటల అర్థం ఏమిటి..? ధోనీని మించిపోతాడా?

భారత అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అని టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కివీస్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో వృద్ధిమాన్ సాహా అద్భుతంగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ

దేశంలో అత్యుత్తమ వికెట్ కీపర్ సాహానే.. కోహ్లీ మాటల అర్థం ఏమిటి..? ధోనీని మించిపోతాడా?
, బుధవారం, 5 అక్టోబరు 2016 (16:03 IST)
భారత అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అని టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కివీస్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో వృద్ధిమాన్ సాహా అద్భుతంగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ.. భారత అత్యుత్తమ వికెట్ కీపర్ సాహా అంటూ కితాబిచ్చాడు. ఇంకా సాహా భారత జట్టు కోసం అద్భుతంగా ఆడుతున్నాడని, వికెట్ కీపింగ్‌లో బుద్ధికుశలత అదుర్స్ అంటూ ప్రశంసించాడు.
 
అయితే విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగింది. టీమిండియాను అత్యుత్తమ జట్టుగా ప్రపంచానికి ఎత్తిచూపి, పలు రికార్డు సాధించేలా చేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెక్ పెట్టే దిశగా కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అంటూ క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నేళ్ల పాటు వికెట్ కీపింగ్‌లో రాటు తేలిన ధోనీని పక్కనబెట్టేందుకే కోహ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడా?అని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
వికెట్ కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సాహానే బెస్ట్ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించడం.. అతనే భారత క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్ అని పొగిడేయడం చూస్తుంటే.. ధోనీని దెప్పిపొడుస్తున్నాడా అనే అనుమానం కలుగకతప్పట్లేదని క్రీడా పండితులు చెప్తున్నారు. ఇకపోతే.. ధోనీ 2014 ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. టెస్టు ఫార్మాట్‌లో 90 మ్యాచ్‌లాడిన ధోనీ 4876 పరుగులు సాధించాడు. 
 
ఇందులో 33 అర్థ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, ఆరు శతకాలున్నాయి. వికెట్ కీపర్‌గా 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు చేశాడు. తద్వారా మార్క్ బౌచర్, ఆడమ్ గిల్ క్రిస్ట్, ఇయాన్ హెలే, మార్ష్ తర్వాత అత్యుత్తమ ఐదో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు వృద్ధిమాన్ సాహా చక్కగా సరిపోతాడని గతంలో సౌరవ్ గంగూలీ కూడా వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ అధికారులను బట్టలూడదీసి.. వెనక వాచేలా వంద దెబ్బలేయాలి: ఖట్జూ