Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీసీసీఐ అధికారులను బట్టలూడదీసి.. వెనక వాచేలా వంద దెబ్బలేయాలి: ఖట్జూ

బీసీసీఐ- లోధాకమిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోధా కమిటీ 159 సవరణలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని బీసీసీఐ వ్యతిరేకించి

Advertiesment
BCCI
, బుధవారం, 5 అక్టోబరు 2016 (15:32 IST)
బీసీసీఐ- లోధాకమిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోధా కమిటీ 159 సవరణలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని బీసీసీఐ వ్యతిరేకించింది. దీంతో సుప్రీం సీరియస్ అయ్యింది. లోధాకమిటీ సిఫార్సులను పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అకౌంట్లు మూతపడ్డాయని.. తద్వారా భారత్-కివీస్‌ల మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్‌ను నిర్వహించలేమని  బీసీసీఐ చేతులెత్తేసింది. 
 
కానీ లోధా కమిటీ మాత్రం బీసీసీకి చెందిన అకౌంట్లను క్లోస్ చేయలేదని.. ఎప్పటిలాగానే బీసీసీఐ క్రికెట్ సిరీస్‌లను నిర్వహించుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది. దీంతో భారత్-కివీస్‌ల మధ్య ఇంకా ఓ టెస్టు, ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఇలా బీసీసీఐ- లోధా కమిటీల మధ్య జరుగుతున్న కోల్డ్‌ వార్‌లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కంటేయ ఖట్జూ కాస్త ఆజ్యం పోశారు. ట్విట్టర్లో ఖట్జూ స్పందిస్తూ.. బీసీసీఐకి ఈ శిక్ష మాత్రమే సరిపోదని, బీసీసీఐ అధికారులను బట్టలూడదీసి కంబానికి కట్టేసి.. వెనక వాచేలా వంద దెబ్బలేయాలన్నారు.
 
అయితే ఖట్జూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో లోధా కమిటీ సిఫార్సులపై విరుచుకుపడ్డారని.. ఈ కమిటీ సిఫార్సులు చట్టవిరుద్ధమైనవని, లోధాకమిటీ తన నివేదికను ముందుగా పార్లమెంట్‌కు పంపాల్సిందని, మంత్రి వర్గ ఆమోదం తర్వాతే.. దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. అప్పట్లో లోధాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఖట్జూ.. ప్రస్తుతం బీసీసీఐ అధికారులను తాట తీయాలని వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం