Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జట్టు సభ్యులవల్లే ఈ కీర్తీ ప్రతిష్టలూ, గుర్తింపులూ అంటున్న కోహ్లీ

మైదానంలో ఫీల్డింగ్ ఎవరైనా సెట్ చేయగలరని, అయితే తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు సభ్యుల వల్లేనని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యా

జట్టు సభ్యులవల్లే ఈ కీర్తీ ప్రతిష్టలూ, గుర్తింపులూ అంటున్న కోహ్లీ
హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (05:40 IST)
మైదానంలో ఫీల్డింగ్ ఎవరైనా సెట్ చేయగలరని, అయితే తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు సభ్యుల వల్లేనని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా 19 టెస్ట్ మ్యాచ్‌లలో విజయం సాధించిన తర్వాత చూస్తే ఏం అంశాల్లో మెరుగుపడినట్టు అనిపిస్తోందని రిపోర్టర్లు అడగ్గా స్పందించాడు. 
 
నిజాయితీగా చెప్పాలంటే మైదానంలో ఫీల్డింగ్ ఎవరైనా సెట్ చేయగలరని, అయితే తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు సభ్యుల వల్లేనని అన్నాడు. తాను చేయాల్సిందల్లా జట్టులో ఉన్న శక్తిని నిరంతరం కొనసాగేలా చూడటమేనని వివరించాడు. తాను దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తానని, తద్వారా జట్టులోని ఇతర సభ్యులు కూడా దాన్ని అనుసరిస్తారని చెప్పాడు.
 
అలసిపోయాను : కోహ్లీ
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 204 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇది వరుసగా 19వ టెస్ట్ మ్యాచ్ విజయం. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ స్టేడియం స్టాఫ్‌తో కలిసి ముచ్చటించాడు. వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. మరోపక్క బంగ్లాదేశ్ యువ క్రికెటర్లతో కొంత సమయం గడిపి, పలు సూచనలు చేశాడు. అయితే తిరిగి తన నివాసానికి బయల్దేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నప్పుడు తన సెల్ఫీను తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాను అలిసి పోయానని, ప్రస్తుతం విమాన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నానని సందేశం పెట్టి అభిమానులకు షేర్ చేశాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పల్ టెస్టు: డబుల్ సెంచరీ ప్లస్ సన్నీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. బంగ్లాపై భారత్ గెలుపు