ఉప్పల్ టెస్టు: డబుల్ సెంచరీ ప్లస్ సన్నీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. బంగ్లాపై భారత్ గెలుపు
బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 459 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశించిన స్
బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 459 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఫలితంగా 100.3 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ అద్భుత రికార్డును నమోదు చేసుకున్నాడు.
ఏకంగా 204 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాకుండా సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా.. తాజాగా బంగ్లాతో జరిగిన ఏకైక టెస్టులోనూ గెలుపొందడం ద్వారా వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించినట్లైంది.
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ హైలైట్ అయ్యింది. వరుస విజయాలతో జట్టును గెలిపించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. తద్వారా అంతకుముందు 18 టెస్టులతో రికార్డుకెక్కిన సునీల్ గవాస్కర్ రికార్డును కోహ్లీ (19టెస్టుల్లో గెలవడం ద్వారా) బ్రేక్ చేశాడు.