కోహ్లిని జైల్లో పెట్టండి... 130 కోట్ల మంది భారతీయులతో ఆడుకున్నాడు... అన్నదెవరు?
ఏ జట్టుపై ఓడినా జీర్ణించుకుంటారు కానీ పాకిస్తాన్ జట్టుపై ఓడితే మాత్రం భారత క్రీడాభిమానుల్లో కొందరు ఒప్పుకోలేరు. ఇది ఇప్పటిది కాదనుకోండి. ఎప్పటినుంచో అదంతే. ఎలాగైనా పాకిస్తాన్ జట్టును ఓడించి తీరాలన్నట్
ఏ జట్టుపై ఓడినా జీర్ణించుకుంటారు కానీ పాకిస్తాన్ జట్టుపై ఓడితే మాత్రం భారత క్రీడాభిమానుల్లో కొందరు ఒప్పుకోలేరు. ఇది ఇప్పటిది కాదనుకోండి. ఎప్పటినుంచో అదంతే. ఎలాగైనా పాకిస్తాన్ జట్టును ఓడించి తీరాలన్నట్లే చూస్తారంతా. కానీ ఆటలో గెలుపు ఓటములు సహజమే. ప్రతిసారీ విజయం భారతజట్టునే వరించదు కదా. అప్పుడప్పుడు బ్యాడ్ లక్ కూడా వెక్కిరిస్తుంటుంది. ఇదే ఆదివారం నాడు టీమిండియాకూ జరిగింది.
కోహ్లీ సేన అటు బౌలింగులోనూ ఇటు బ్యాటింగులోనూ ఘోరంగా విఫలమై భారత క్రికెట్ క్రీడాభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. దీనిపై కొందరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఫిల్మి క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ ఈసారి క్రికెట్ క్రీడపైనా ట్వీట్లు చేశాడు. 130 కోట్ల మంది భారతీయులతో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడుకున్నాడనీ, వారి గౌరవానికి భంగం కలిగించాడనీ అందువల్ల ఆయన్ను వెంటనే జైల్లో పెట్టాలంటూ ట్వీట్ చేశాడు.
అంతేకాదు... ధోనీని కూడా లాకప్ లో వేయాలంటూ ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లపై అటు పాకిస్తాన్ నుంచి ఇటు భారతదేశం నుంచి నెటిజన్లు మండిపడ్డారు. ఒక్కసారి పరాజయం చూసినంత మాత్రాన ఇలా స్పందించడం సరికాదనీ, గెలుపు ఓటములు సహజమంటూ హితవు పలికారు.