Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ భూభాగం నుంచి వెళ్లి పాక్‌లో టపాసులు కాల్చుకో... గౌతమ్ గంభీర్ ట్వీట్

పాకిస్తాన్ జట్టు పొరబాటున భారత జట్టుపై గెలిస్తే ఇదివరకూ కొందరు వేర్పాటువాదులు టీవీల ముందు సెలబ్రేషన్స్ చేస్తూ హంగామా చేసుకునేవారు. కానీ ఈసారి అది కాశ్మీర్ రోడ్ల మీదికి కూడా వచ్చేసింది. అంతేకాదు... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వేర్పాటు వాదులు పాకిస్తాన్

Advertiesment
భారత్ భూభాగం నుంచి వెళ్లి పాక్‌లో టపాసులు కాల్చుకో... గౌతమ్ గంభీర్ ట్వీట్
, సోమవారం, 19 జూన్ 2017 (13:45 IST)
పాకిస్తాన్ జట్టు పొరబాటున భారత జట్టుపై గెలిస్తే ఇదివరకూ కొందరు వేర్పాటువాదులు టీవీల ముందు సెలబ్రేషన్స్ చేస్తూ హంగామా చేసుకునేవారు. కానీ ఈసారి అది కాశ్మీర్ రోడ్ల మీదికి కూడా వచ్చేసింది. అంతేకాదు... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వేర్పాటు వాదులు పాకిస్తాన్ జట్టుకుని నీరాజనాలు పడుతున్నారు. 
 
కాశ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫ‌రూక్‌ ఓ ట్వీట్ చేస్తూ... ఎటు చూసినా ప‌టాకుల మోత‌తో ఈద్ ముందే వ‌చ్చిన‌ట్లుంది.. పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు అంటూ ఫ‌రూక్ ట్వీట్ చేశాడు. దీనిపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫరూక్... మీకో సలహా... మీరు ఇక్కడ కాదు కానీ భారత సరిహద్దు దాటి వెళితే అక్కడ మంచి పటాసులు దొరుకుతాయి. అక్కడికెళ్లి నీ ఉత్సహాన్ని సెలబ్రేట్ చేసుకో... కావాలంటే ప్యాకింగులో నేను సాయం చేస్తా అంటూ ట్వీట్ చేసాడు గంభీర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు.. జెంటిల్‌మెన్ కూడా: పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు