Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాక్స్ సెంచరీపై విరాట్ కోహ్లీ కామెంట్స్... జాక్స్ సిక్స్‌ల వెనుకున్న అసలు సీక్రెట్ ఇదే...

virat kohli

వరుణ్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (11:49 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్సీబీ జట్టు 200 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించి, విజయాన్ని అందుకుంది. 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఛేదనలో అదరగొట్టింది. విల్ జాక్స్ సెన్సేషనల్ సెంచరీకి విరాట్ బ్యాటింగ్ కూడా తోడవడంతో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు ఓవర్లు మిగిలుండగానే గెలుపు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. 
 
కేవలం 41 బంతుల్లో విల్ జాక్స్ సెంచరీ పూర్తి చేసుకోగా విరాట్ 70 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ విజయంతో ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలో సంతోషం అంబరాన్ని అంటింది. ఇక జాక్స్ సెంచరీపై కోహ్లి కామెంట్స్ కూడా వైరల్‌గా మారాయి. 16వ ఓవర్లో తొలి బంతిలో సిక్స్ కొట్టనందుకు తనకు చిరాకెత్తిందని విరాట్ వ్యాఖ్యానించాడు. అయితే, ఆ ఓవర్ ఆఖరులో జాక్స్ స్కోర్ 94 ఉండగా విజయానికి ఇంకా ఒక పరుగు మాత్రమే కావాల్సివుంది. అప్పుడు జాక్స్ సిక్స్ బాదడం చూశాక తను మొదట్లో సిక్స్ కొట్టక పోవడం మంచిదే అయ్యిందని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఆర్సీబీ నెట్టింట పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. 
 
కాగా, 31 బంతుల్లో తొలి అర్థ సెంచరీ చేసి జాక్స్ ఆ తర్వాత 10 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. జాక్స్ వరుస సిక్సుల వెనుకున్న కారణాన్ని కూడా విరాట్ చెప్పుకొచ్చాడు. "అతడు రెండు రన్స్ తీద్దామన్నాడు. నేను మూడో రన్ కోసం చూశా. ఇలా వికెట్ల పరుగులు తీయలేక జాక్స్ చివరకు సిక్సర్లు కొట్టేందుకు డిసైడయ్యాడు. అతడి సిక్సుల వెనుకున్న అసలు సీక్రెట్ అది అని చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై-హైదరాబాద్ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో రికార్డ్