పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి ధోనీకి ఉద్వాసన
పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీకి ఉద్వాసన పలికారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పుణె జట్టు ఓ ఫ్రాంచైజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు.
పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీకి ఉద్వాసన పలికారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పుణె జట్టు ఓ ఫ్రాంచైజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు.
ఈ నేపథ్యంలో గత ఐపీఎల్‌లో ధోనీ నేతృత్వంలోని జట్టు పేలవ ప్రదర్శన చేసినందుకుగానూ అతనిని తప్పించింది. ధోనీ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను నియమించింది. గత ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌తో పాటు పుణె ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ధోనీకి ఇది గట్టి ఎదురుదెబ్బ వంటిదే. గత ఐపీఎల్ సీజన్‌లో వ్యక్తిగతంగా ధోనీ ఆట తీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్థ సెంచరీతో పాటు 284 పరుగులు మాత్రమే చేశాడు.