రొట్టె విరిగి నేతిలో పడింది... టెన్నిస్ మెరుపుతీగ రెండోసారి డేటింగ్‌కు రెడీ అంది...
ఆమె ఓ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమే కెనడా టెన్నిస్ స్టార్ బౌచర్డ్. ఆమెను కలుసుకోవాలంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది సోషల్ మీడియాలో ముక్కూమొహం తెలియని జాన్ జూర్క్ అనే కుర్రాడితో పందెం కట్టింది. ఆ పం
ఆమె ఓ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమే కెనడా టెన్నిస్ స్టార్ బౌచర్డ్. ఆమెను కలుసుకోవాలంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది సోషల్ మీడియాలో ముక్కూమొహం తెలియని జాన్ జూర్క్ అనే కుర్రాడితో పందెం కట్టింది. ఆ పందెంలో ఓడితే డేటింగ్ కు వస్తానని. ఓడిపోయింది... అతడితో మొదటిసారి డేటింగ్ చేసింది.
ఈ నేపధ్యంలో ఆమెను మీడియా ప్రశ్నించింది. అసలు అతడు ఎలాంటివాడో తెలియకుండా అతడితో డేటింగ్ ఎలా అనిపించింది అని అడిగితే... జాన్ జెంటిల్మన్... అతడితో మరోసారి డేటింగ్‌కు వెళదామని అనుకుంటున్నా అని చెప్పి షాకిచ్చింది. ఇంకేముంది... జాన్ రొట్టె విరిగి నేతిలో పడిందని చిందులు వేస్తున్నాడట.