Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదో వన్డే : రాయుడు - పాండ్యా మెరుపుదాడి... భారత్ 252 ఆలౌట్

Advertiesment
ఐదో వన్డే : రాయుడు - పాండ్యా మెరుపుదాడి... భారత్ 252 ఆలౌట్
, ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:13 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 49.5 ఓవ్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడు (90)తో ఆదుకున్నాడు. ఫలితంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరును చేసింది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ ఆదివారం ఉదయం ప్రారంభంకాగా, భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఒక దశలో 18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, చివర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 
 
రాయుడు 113 బంతుల్లో 44సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేయడంతో భారత్.. ప్రత్యర్థి ముంగిట ఛాలెంజింగ్ స్కోరును ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్ (2), ధావన్ (6), శుభ్‌మాన్ గిల్  (7), ధోనీ (1) దారుణంగా విఫలమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదో వన్డేపై కివీస్ గురి... ప్రతీకారానికి సిద్ధమైన టీమిండియా