Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. రాణించిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్ స్కోర్.. 268/8

ఇంగ్లండ్‌తో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. అయినప్పటికీ ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, బట్లర్ రాణ

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. రాణించిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్ స్కోర్.. 268/8
, శనివారం, 26 నవంబరు 2016 (17:36 IST)
ఇంగ్లండ్‌తో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. అయినప్పటికీ ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, బట్లర్ రాణించడంతో ఆకట్టుకునే స్కోరు సాధించింది. పేసర్లకు అనుకూలించే పిచ్‌‌పై స్పిన్నర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఓపెనర్ హమీద్ (9) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ (15) కూడా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో తడబడ్డ ఓపెనర్, కెప్టన్ కుక్ (27) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో నిలదొక్కుకున్నాడు. అనంతరం వచ్చిన మొయిన్ అలీ (16) విఫలమయ్యాడు.
 
దీంతో బెన్ స్టోక్స్ (29) కూడా స్ట్రోక్స్ ఆడలేక పెవిలియన్ చేరాడు. అయితే జోస్ బట్లర్ (43) నిలదొక్కుకోవడంతో బెయిర్ స్టో (89) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించి పెట్టడంలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. వీరికి తర్వాత వోక్స్ 25 పరుగుల వద్ద అవుట్ కావడం ద్వారా తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. 
 
ప్రస్తుతం రషీద్ (4), బెట్టీ (0) క్రీజులో ఉన్నారు. ఇక టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ చెరి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్, షమి చెరో వికెట్ పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూజిలాండ్‌‌తో టెస్టు.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఐదు పరుగులే.. యూనిస్ ఖాన్ చెత్త రికార్డు