Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూజిలాండ్‌‌తో టెస్టు.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఐదు పరుగులే.. యూనిస్ ఖాన్ చెత్త రికార్డు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన యూనిస్ ఖాన్, కేవలం ఐదు పరుగులు మాత్రమే సా

Advertiesment
A rare slump for Younis Khan
, శనివారం, 26 నవంబరు 2016 (17:02 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన యూనిస్ ఖాన్, కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించి.. అప్రతిష్టను మిగుల్చుకున్నాడు. కివీస్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు మూడు ఇన్నింగ్స్‌ల్లో యూనిస్ నమోదు చేసిన పరుగులు 0, 2, 1 గా ఉన్నాయి. ఇలా తాజా ఇన్నింగ్స్ (2)ను కలిపి వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 10 వ్యక్తిగత పరుగుల కంటే తక్కువ చేయడం యూనిస్ టెస్టు కెరీర్‌లో ఇదే తొలిసారి.
 
ఇక రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా పాకిస్థాన్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాకిస్థాన్ ఆటగాళ్లు సమీ అస్లామ్(5) , అజహర్ అలీ(1), యూనిస్ ఖాన్(2), అసాద్ షఫిక్(23), రిజ్వాన్(0)లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో ఆట ముగిసేసరికి పాకిస్థాన్ ఐదు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. అంతకుముందు 77/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 271పరుగుల వద్ద ఆలౌటైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువరాజ్ సింగ్ పెళ్ళికి హాజరు కావట్లేదట.. తండ్రి యోగ్‌ రాజ్ షాకింగ్ న్యూస్