Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువరాజ్ సింగ్ పెళ్ళికి హాజరు కావట్లేదట.. తండ్రి యోగ్‌ రాజ్ షాకింగ్ న్యూస్

మోడల్ హాజల్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న యువీకి అతని తండ్రి యోగ్ రా

Advertiesment
Yuvraj Singh’s father Yograj Singh will not attend his wedding ceremony
, శనివారం, 26 నవంబరు 2016 (13:14 IST)
మోడల్ హాజల్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న యువీకి అతని తండ్రి యోగ్ రాజ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువరాజ్ వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. 
 
సింగ్ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న ఈ వివాహానికి హాజరు కావట్లేదని యువీ తండ్రి చెప్పుకొచ్చారు. ఇంకా సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే చెప్పానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని తేల్చేశారు. 
 
అందుకే తన కుమారుడి పెళ్ళికి కూడా హాజరు కావట్లేదని చెప్పుకొచ్చారు. కానీ, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్ వద్ద జరిగే మెహిందీ ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు. అయితే ఈ వార్త యువీకి బాధను మిగిల్చడం ఖాయమని క్రికెట్ పండితులు అంటున్నారు. కాగా యువరాజ్ సింగ్ తల్లిదండ్రులు విడాకుల ద్వారా కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొహాలీ టెస్ట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్.. కరుణ్ నాయర్‌ 'టెస్ట్‌' అరంగేట్రం