Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేంద్ర సింగ్ ధోనీ రాజనీతి.. ఒకే బంతిలో రెండు వికెట్లు ఎలా? (Video)

మహేంద్ర సింగ్ ధోనీ రాజనీతి.. ఒకే బంతిలో రెండు వికెట్లు ఎలా? (Video)
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:16 IST)
వైజాగ్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ్యాచ్ చివరి వరకు పోరాడిన టీమిండియాకు చివరికి ఓటమి మాత్రమే మిగిలింది. కానీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. తన బుద్ధికుశలతను ఉపయోగించాడు. తద్వారా ఒకే బంతిలో రెండు వికెట్లు పడగొట్టేలా చేశాడు. 
 
అదెలాగో చూద్దాం.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ-20 భారత బ్యాట్స్‌మెన్లు చెప్పుదోగిన పరుగులు సాధించలేదు. ఇలా 15వ ఓవర్ వద్ద మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న తరుణంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లను పడగొట్టే అవకాశాన్ని ధోనీ టీమిండియా బౌలర్లకు కల్పించాడు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ షార్ట్.. బంతిని బౌండరీకి తరలించి రెండు పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. 
 
బౌండరీ లైన్‌లో వున్న కృనల్ పాండ్యా.. బంతిని ఎమ్ఎస్ ధోనీకి అతి వేగంగా అందించాడు. ఆ బంతిని తీసుకున్న ధోనీ షార్ట్‌ను రనౌట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. మరో బ్యాట్స్‌మెన్ కూడా క్రీజు నుంచి దూరంగా నిలబడటంతో.. ఆతనిని కూడా అవుట్ చేసేందుకు ఉమేష్ యాదవ్‌కు ధోనీ బంతిని విసిరాడు. ఉమేష్ కూడా షార్ట్‌తో భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను రనౌట్ చేశాడు. 
 
ఇలా ధోనీ చాకచక్యంగా వ్యవహరించి ఒకే బంతిలో రెండు వికెట్లను కూల్చాడు. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం.. తొలుత  బౌలర్ ఏ స్టంప్‌ను బంతితో రనౌట్ చేసాడో దాన్నే వికెట్‌గా పరిగణిస్తారు. దీంతో ఒకే బంతికి రెండు వికెట్లు టీమిండియాకు లభించకపోయినా.. ధోనీ టాలెంట్‌తో ఒకే బంతిలో రెండు వికెట్లను కూలగొట్టే టాలెంట్ తనకుందని నిరూపించాడు. 
 
కానీ ఒకే బంతిలో రెండు వికెట్లు కూల్చే రూల్సే క్రికెట్‌లో లేనందున.. ఒకే బంతిలో రెండు రనౌట్లు చేసే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుందని చెప్పవచ్చు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనీ సమర్థవంతంగా క్రీజు కాస్త దూరంగా వుండే ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ.. వికెట్లు కూల్చడంలో దిట్ట అని కొనియాడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్య బాబోయ్.. ఐపీఎల్ వచ్చేస్తోందా.. జడుసుకుంటున్న ఇషాంత్ శర్మ సతీమణి