Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ‌- ఆస్ట్రేలియా రెండో వన్డే.. కసితో కంగారులు

భారత్, ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, రెండో వన్డే మ్యాచ్ గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలో జరి

భారత్ ‌- ఆస్ట్రేలియా రెండో వన్డే.. కసితో కంగారులు
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (09:11 IST)
భారత్, ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, రెండో వన్డే మ్యాచ్ గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలన్న కసితో కంగారులు ఉన్నారు. అయితే, తొలి వన్డేలో బౌలింగ్‌తో దుమ్ము రేపిన భారత్‌.. ఈ సారి బ్యాట్‌నూ ఝుళిపించేందుకు సిద్ధంగా ఉంది. 
 
కంగారూలంటేనే రెచ్చిపోయి ఆడే బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు మునుపటి ఫామ్‌ ప్రదర్శించాల్సిన అవసరముంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమవుతున్న వేళ లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల మీదనే జట్టు ఆధారపడటం ఆందోళన కలిగించే విషయం. 
 
ఉపఖండ పిచ్‌లంటేనే కంగారు పడే ఆసీస్‌కు భారత బౌలింగ్‌ లైనప్‌ ముందు నిలకడగా రాణించటమే సమస్య. మణికట్టు మాయగాళ్లు కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేందర్‌ చాహాల్‌లు మరోసారి స్పిన్‌ మంత్రం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆలౌరౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భువనేశ్వర్‌, పాండ్యలు భారత్‌కు అదనపుబలం. 
 
అయితే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఉన్న ఆసీస్‌ ఎప్పుడైనా విజృంభించవచ్చు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో పరుగుల వరదను కట్టడి చేయాల్సిన భాద్యత భారత బౌలర్లపైన ఉన్నది. ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ సహా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లు ఒత్తిడిలో సైతం రాణించగల ఆటగాళ్లు. వీళ్లని అదుపు చేస్తే మరో విజయం భారత్‌ ఖాతాలో పడటం ఖాయం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది..