Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓవల్ వన్డే : రాహుల్ శతకం... కివీస్ విజయలక్ష్యం 297

ఓవల్ వన్డే : రాహుల్ శతకం... కివీస్ విజయలక్ష్యం 297
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:23 IST)
ఓవల్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. 
 
అయితే, టీమిండియాకు రెండో ఓవర్‌లోనే గట్టిదెబ్బ తగిలింది. ఈ ఓవర్ చివరి బంతికి కివీస్ బౌలర్ జెమిసన్ షాకిచ్చాడు. ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్నెట్ బౌలింగ్‌లో జెమిసన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా ఎనిమిదో ఓవర్ ముగియకముందే భారత్ అత్యంత కీలకమైన రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఆ తర్వాత ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ చెరో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో మొత్తం 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది. ఫలితంగా కివీస్ ముంగిట 297 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ ఆటగాళ్లు అదుర్స్.. అక్భర్ నిలబెట్టాడు.. కానీ సోదరి మరణ వార్త తెలిసి?