Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పది : గౌతం గంభీర్

పాకిస్థాన్ నటులకు మద్దతు తెలిపిన వారిపై క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ మేరకు ట్విట్టర్లో తన భావాలు వ్యక్తం చేసిన గంభీర్, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ నటులకు మద్దతివ్వడం శ

సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పది : గౌతం గంభీర్
, గురువారం, 20 అక్టోబరు 2016 (10:46 IST)
పాకిస్థాన్ నటులకు మద్దతు తెలిపిన వారిపై క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ మేరకు ట్విట్టర్లో తన భావాలు వ్యక్తం చేసిన గంభీర్, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ నటులకు మద్దతివ్వడం ఖండించదగిన చర్యగా పేర్కొన్నాడు. సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పదన్న విషయం గుర్తించాలని.. ఏసీ గదుల్లో కూర్చుని నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దని.. సీమాంతర ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయేదాకా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారే దాకా ఆ దేశంతో క్రికెట్‌కు తాను వ్యతిరేకమని స్పష్టంచేశాడు. 
 
ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని పాకిస్థాన్ నటులకు మద్దతు తెలిపిన గంభీర్ సవాల్ విసిరాడు. కాగా గంభీర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ గంగూలీ మద్దతు పలికాడు. పాకిస్థాన్‌తో కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడకుండా ఉండటం మంచిదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 
 
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. మన జవాన్లను చంపేస్తుంటే.. పాక్‌తో క్రికెట్ సిరీస్‌లు ఆడటం ఎంత వరకు న్యాయం అని గంగూలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే.. వాస్తవానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశం అయినా.. పాకిస్తాన్‌తో క్రికెట్‌ని కొన్నాళ్లు నిలిపివేయడం ఉత్తమమైన పనని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబుల్స్ ర్యాంకింగ్స్‌: 80 వారాల పాటు నెం.1 ర్యాంకులో సానియా.. సరికొత్త రికార్డు..