Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్‌ టూర్‌లో వైట్ వాష్ నుంచి టీమిండియా ఎస్కేప్

న్యూజిలాండ్‌ టూర్‌లో వైట్ వాష్ నుంచి టీమిండియా ఎస్కేప్
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (16:39 IST)
భారత క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌ టూర్‌లో వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. చివరిదైన ఐదో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు టీమిండియా మహిళలు. కివీస్ జట్టు చిత్తుగా ఓడించారు. 
 
మొదట బౌలింగ్‌లో కివీస్‌ను కట్టడి చేసిన భారత అమ్మాయిలు ఆ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
 
మొదట భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.  
 
అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. 
 
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (71), హర్మన్ ప్రీత్ కౌర్ (63), కెప్టెన్ మిథాలీ రాజ్ (57*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ (21), షఫాలీ వర్మ (9), రిచ్ ఘోష్ (7*) పరుగులు చేశారు.
 
కివీస్ బౌలర్లలో జేన్సన్, అమేలీ కేర్, జోన్స్‌, హన్నా రోవ్ తలో వికెట్ తీశారు. వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఆడిన భారత అమ్మాయిలు ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కివీస్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అండర్-19 ప్రపంచ కప్‌.. భారత ఆటగాళ్లకు అవమానం.. ఏం జరిగింది?