Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత ఏ జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందా? ఇషాన్ కిషన్ ఏమన్నాడు

Advertiesment
ishan kishan

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (16:23 IST)
భారత్, ఆస్ట్రేలియా ఏ క్రికెట్ మధ్య అనధికారి టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇందులో భారత ఏ జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు ఫీల్డ్ అంపైర్ క్రెయిగ్ ఆరోపించారు. వీటిని భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ తిప్పికొట్టారు. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో ఫీల్డ్ అంపైర్ తరచుగా బంతిని మార్చి బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఇషాన్ కిషన్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఫీల్డ్ అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో మైదానంలోనే ఇషాన్ కిషన్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బంతిపై రుద్దినట్లు కనిపించడంతో భారత ఆటగాళ్లపై అంపైర్ క్రెయిగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు స్టంప్స్ మైక్స్‌లో రికార్డు కావడం గమనార్హం.
 
బంతి మార్పుపై భారత ఆటగాళ్లు అడుగుతున్న సమయంలో అంపైర్ స్పందిస్తూ.. 'చర్చలకు తావులేదు. వెళ్లి ఆడండి. ఇక్కడేమీ చర్చా కార్యక్రమం జరగడం లేదు' అని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే ఇషాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'మేం ఇదే బంతితో ఆడాలా? మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం' అని అన్నాడు. 'మీ వల్లే బంతి పాడైంది. నువ్వే (ఇషాన్ ను ఉద్దేశించి) స్క్రాచ్ చేశావు. అందుకే బంతిని మార్చాం. కేవలం మీ చర్యల వల్లే బంతి మార్పు జరిగింది' అని అంపైర్ వెల్లడించాడు. 
 
ఈ క్రమంలో టాంపరింగ్ ఆరోపణలు నిజమైతే భారత ఏ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం లేకపోలేదు. దీనిపై ఇటు క్రికెట్ ఆస్ట్రేలియా లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టుల సిరీస్ బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. టీమిండియా నిర్దేశించిన 225 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తుగా ఓడిన భారత్ : ర్యాంకుల పట్టికలో రెండో స్థానానికి...