Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై టెస్ట్ మ్యాచ్ : లక్ష్య ఛేదనలో భారత్ తడబాటు

Rajkot Test

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (12:09 IST)
ముంబై వేదికగా ఆతిథ్య భారత్, పర్యాటక న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ధేశించిన 147 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంతో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్‌సో రిషబ్ పంత్ (53 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్)తో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 55 పరుగులు అవసరం కాగా.. సిరీస్‌ను వైట్వాష్ చేసేందుకు న్యూజిలాండ్ నాలుగు వికెట్ల దూరంలో ఉంది. దీంతో టీమ్ ఇండియాను గెలిపించాల్సిన భారం పంత్ - సుందర్ జోడీపై ఉంది. ఆ తర్వాత వచ్చే అశ్విన్ కూడా బ్యాటింగ్ చేసినప్పటికీ మిగిలిన ఇద్దరు టెయిల్ ఎండ్ ఆటగాళ్ల నుంచి పరుగులను ఆశించడం అత్యాశే అవుతుంది. 
 
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను కివీస్ స్పిన్నర్లు ఇబ్బంది పెట్టారు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తుండటంతో చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (4/30) దెబ్బకు టీమిండియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. తొలుత రోహిత్ శర్మ (11)ను మాట్ హెన్రీ వేసిన బంతిని పుల్షాట్ కొట్టేందుకు ప్రయత్నించి వికెట్ ఇచ్చాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (1)ను అజాజ్ ఔట్ చేశాడు. 
 
కాస్త కుదురుగా ఆడుతున్నాడనుకున్న యశస్వి జైస్వాల్ (5)ను గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల ముందు దొరకబచ్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (1) రెండో బంతినే భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా అజాజ్ ఖాతాలోనే పడింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా (6: 22 బంతుల్లో) కలిసి పంత్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకొన్నాడు. 
 
మరో ఎండ్‌లో పంత్ దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అయితే, దురదృవశాత్తూ అజాజ్ బౌలింగ్ జడేజా ఆడిన బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్‌లో ఉన్న విల్ యంగ్ చేతిలో పడింది. అనంతరం సుందర్ కలిసి పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: అద‌ర‌గొట్టిన తెలుగు టైటాన్స్‌, బెంగళూర్‌ బుల్స్‌పై 38-35తో విజయం