Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 : భారత్‌ చెత్త బ్యాటింగ్ : కివీస్‌ ముందు స్వల్ప విజయలక్ష్యం!

Advertiesment
ఐసీసీ టీ20 : భారత్‌ చెత్త బ్యాటింగ్ : కివీస్‌ ముందు స్వల్ప విజయలక్ష్యం!
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:15 IST)
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా ఆదివారం బలమైన న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన చెత్త బ్యాటింగ్‌తో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఫలితంగా కివీస్ ముంగిట స్వల్ప విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరోమారు తమ చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేశారు. పలితంగా కేఎల్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (4), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12), హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (26), శార్దూల్ ఠాగూర్ (0) చొప్పున పరుగుల చేశారు. అదనంగా మరో నాలుగు పరుగులు వచ్చాయి. 
 
కివీస్ బౌలర్లలో టెంట్ బౌల్ట్ 4 ఓవర్లు వేసి 20 రన్స్ ఇచ్చి మూడు వికెట్ల పడగొట్టాడు. అలాగే, ఐష్ సోధి రెండు, సౌథీ, మిల్నీ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ను తీవ్రంగా పరిగణించిన భారత్... వీపులో నొప్పితో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్, ఫామ్‌లో లేని భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చారు.
 
అలాగే, న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చేశారు. టిమ్ సీఫెర్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే జట్టులోకి వచ్చాడు. సూపర్-12 దశలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచ్ ను పాకిస్థాన్‌తో ఆడి ఓటమిపాలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు