Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

4th T20, పోరాడి గెలిచిన టీమిండియా, 8 పరుగుల తేడాతో...

4th T20, పోరాడి గెలిచిన టీమిండియా, 8 పరుగుల తేడాతో...
, గురువారం, 18 మార్చి 2021 (23:44 IST)
నాలుగో టి20లో ఇంగ్లాండు జట్టుపై టీమిండియా పోరాడి గెలిచింది. చివర్లో థాకూర్ 2 వైడ్ బాల్స్ వేసి కాస్తంత ఉత్కంఠతకు తెరతీసినప్పటికీ చివర్లో వికెట్ తీయడంతో విజయం భారత వశమైంది.
 
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్సమన్లకు క్రమంగా పెవిలియన్ దారి పట్టిస్తూ మ్యాచును తమవైపు తిప్పుకున్నారు. జోస్ బట్లర్ 9 పరుగులకే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్ సైతం ఒక సిక్సర్ కొట్టి మెరిపించినప్పటికీ 14 పరుగులకే ఔటయ్యాడు. ఐతే రాయ్ బాగా కుదురుకున్నాడు.  ఆ దశలో అతడికి బెయిర్‌స్టో తోడవడంతో ఇద్దరూ 9 ఓవర్లో జట్టు స్కోరును 131 చేర్చారు. అదే ఓవర్లో ప్రమాదకర ఇన్నింగ్స్ ఆడుతున్న రాయ్(40 పరుగులు) పాండ్యా బౌలింగులో యాదవ్‌కి చిక్కాడు.
 
ఆ తర్వాత బెయిర్ స్టో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ బెన్ స్టోక్స్ ఇండియన్ బౌలర్లకు దడ పుట్టించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. అతడి ఖాతాలో 3 సిక్సర్లు, 4 ఫోర్లు పడ్డాయి. టీమిండియా విజయావకాశాలపై దెబ్బ తీసే దిశగా పయనించాడు. ఐతే థాకూర్ బౌలింగులో యాదవ్ కి చిక్కాడు. 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ దశలో ఇంకా ఇంగ్లాండు విజయావకాశాలకు ఢోకా లేనట్లే అనిపించింది.
 
ఐతే స్టోక్స్ అలా వెళ్లగానే మోర్గాన్ ఇలా అవుటయ్యాడు. అతడు 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శామ్ కుర్రాన్ పాండ్యా బౌలింగులో బౌల్డయ్యాడు. జోర్డాన్ సైతం భారీ షాట్ల కోసం ప్రయత్నించి పాండ్యా చేతికి చిక్కాడు. ఇక ఆ తర్వాత ఆర్చర్, రషీద్ లు ప్రయత్నించినా నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీనితో భారత్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దంగల్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య.. ఓటమితో మనస్తాపం.. ఉరేసుకుని..?!