అమెరికా గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటగాళ్లు చెలరేగుతున్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విజృంభించాడు. రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
అయితే రోహిత్ శర్మ ధాటికి ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బంతికి పెవిలియన్ చేరాడు. కానీ స్టార్క్ విసిరిన ఒక ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 4 సిక్సులు, 1 ఫోర్ బాదడం విశేషం.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా, అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్‌ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు.
ఆరోన్ జోన్స్... 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది. ప్రస్తుతం భారత్ ఆటగాళ్లలో శివమ్ దూబే , హార్దిక్ పాండ్యా క్రీజులో వున్నారు.