భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ మొహాలీలోని స్టేడియంలో ప్రారంభంకాగా, ఇందులో తొలుత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 2 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇటీవల ఆసియా కప్ టోర్నీలో మంచి ఫామ్‌ను కొనసాగించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరడం ప్రతి ఒక్కరినీ నిరాశపరిచింది.
అలాగే సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశాడు. రాహుల్ 55 పరుగుల చేశాడు. మొత్తం 35 బంతులను ఎదుర్కొన్న రాహుల్.. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 13.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ ఎలిస్, కామెరన్ గ్రీన్‌లు ఒక్కో వికెట్ తీశారు.