Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ ఆడటం చేతకాకపోతే.. ఇంట్లో కూర్చోండి.. విదేశీ పర్యటనలకు ఎందుకొస్తారు: పాక్‍పై ఛాపెల్ ఫైర్

పాకిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే దాయాది దేశమైన భారత్‌తో సిరీస్ ఆడకుండా కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగ

క్రికెట్ ఆడటం చేతకాకపోతే.. ఇంట్లో కూర్చోండి.. విదేశీ పర్యటనలకు ఎందుకొస్తారు: పాక్‍పై ఛాపెల్ ఫైర్
, సోమవారం, 9 జనవరి 2017 (17:56 IST)
పాకిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే దాయాది దేశమైన భారత్‌తో సిరీస్ ఆడకుండా కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. దీంతో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లకు ఆడటం చేతకాకపోతే ఇంట్లో కూర్చోండని.. ఛాపెల్ ఫైర్ అయ్యాడు. 
 
ఆడటం చేతకాకపోతే.. విదేశీ పర్యటనలకు ఎందుకొస్తున్నారని ఛాపెల్ ప్రశ్నించాడు. ఆటను మెరుగుపర్చుకోలేకపోతే విదేశీ పర్యటనలకు రాకండని సూచించాడు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ జట్టును ఆస్ట్రేలియా పర్యటనకు ఆహ్వానించకూడదని క్రికెట్ ఆస్ట్రేలియాను విజ్ఞప్తి చేశాడు. వాళ్లు తమ ఆట తీరును మార్చుకుని ఆతిథ్య దేశానికి సరైన పోటీనిచ్చే వరకు వారిని కంగారూల దేశానికి పిలవొద్దన్నాడు. మిస్బా ఆకట్టుకోలేదని... ఆస్ట్రేలియాకు విజయ సంబరాలు అవసరం లేదని.. సరైన జట్టులో ఆస్ట్రేలియా పోటీ పడలేదని ఛాపెల్ విమర్శించాడు. 
 
ప్రస్తుతం ఆసిస్ టూర్‌లో ఉన్న పాకిస్థాన్ జట్టు కంగారూలపై టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయి వైట్ వాష్‌కు గురైంది. ఆసీస్ గడ్డపై పాక్ ఇలా వరుసగా 12 మ్యాచ్‌లను కోల్పోయి, నాలుగు వైట్‌వాష్‌లకు ఎదుర్కొంది. దీంతో పాక్‌పై అటు స్వదేశంతో పాటు ఆస్ట్రేలియాలోనూ విమర్శలు ఎక్కువైనాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాడీ యువరాజ్ మళ్లీ వచ్చాడు.. జాగ్రత్త బ్రాడ్..!