Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాడీ యువరాజ్ మళ్లీ వచ్చాడు.. జాగ్రత్త బ్రాడ్..!

యువరాజ్ మళ్లీ వచ్చాడు.. రిటైర్మెంటుపై వెంటనే నిర్ణయం తీసుకో బ్రాడ్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా ముందుజాగ్రత్తలతో మార్మోగుతోంది. భారత కెప్టెన్ బాధ్యతలనుంచి ధోనీ తప్పుకోవడం, విరాట్ కోహ్లీ కొత్తగా అన్ని పార్మాట్‌లలోనూ కేప్టెన్‌గా నియమించబడటం నేపథ్యంలో మర

డాడీ యువరాజ్ మళ్లీ వచ్చాడు.. జాగ్రత్త బ్రాడ్..!
హైదరాబాద్ , సోమవారం, 9 జనవరి 2017 (04:29 IST)
యువరాజ్ మళ్లీ వచ్చాడు.. రిటైర్మెంటుపై వెంటనే నిర్ణయం తీసుకో బ్రాడ్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా ముందుజాగ్రత్తలతో మార్మోగుతోంది. భారత కెప్టెన్ బాధ్యతలనుంచి ధోనీ తప్పుకోవడం, విరాట్ కోహ్లీ కొత్తగా అన్ని పార్మాట్‌లలోనూ కేప్టెన్‌గా నియమించబడటం నేపథ్యంలో మరొక సంచలనం.. దాదాపుగా తలుపులు మూసుకుపోయిన స్థితిలో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ అనూహ్యంగా భారత వన్డే జట్టులోకి రావడం ఇంకో సంచలనం. యువరాజ్ పునరాగమనం వార్త క్రికెట్ అభిమానులందరికీ ఒక మర్చిపోని జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తుకొచ్చింది.
 
రావడం రావడం యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌తో వన్డే సీరీస్‌లో ఆడనుండటంతో భారతీయ క్రికెట్ అభి్మానులంతా ఇంగ్లండ్ జట్టు బౌలర్ స్టువర్డ్ బ్రాడ్‌పై సానుభూతి చూపటం మొదలెట్టేశారు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో బ్రాడ్ ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల మోత సాగించి బ్రాడ్‌ను బిత్తరపోయేలా చేసిన యువరాజ్ వీర విజృంభణ ఘటనను క్రికెట్ అభిమానులు, సెలబ్రిటీలు కూడా మళ్లీ గుర్తుతెచ్చుకుంటూ బ్రాడ్‌పై ట్వీట్ల వరద మొదలెట్టేశారు. ఈ వార్త వినగానే స్టువర్ట్ బ్రాడ్ ముఖంలోని బిత్తిరి గురించిన ఫొటోలతో సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. 
 
మీ డాడీ యువరాజ్ వస్తున్నాడు బ్రాడ్ జాగ్రత్త అని కొందరు. ఇక రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికి వెళ్లిపో బ్రాడ్ అని కొందరు. సిక్సర్ల మోతకు మళ్లీ కాచుకో బ్రాడ్ అని కొందరు చెణుకుల చెణుకుల మీద విసిరేశారు. కెరీర్ మొదట్లోనే యువరాజ్ పిచ్చికొట్టుకు బారినపడి  బలైపోయిన బ్రాడ్ ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలింగ్ వెన్నెముకగా పరిణతి చెందడం మరొక విషయం అనుకోండి. కాని జనవరి 15 నుంచి జరగనున్న వన్డే పోటీల్లో యువరాజ్, బ్రాడ్ మధ్య సమరమే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందనటంలో  సందేహమే లేదు. 
 
ఒక యువబౌలర్‌ బంతులను అంతగా బాదిపడేసి ఓవర్‌కు ఆరు సిక్సర్ల వరద సృష్టించిన యువరాజ్ ఆ తర్వాత బ్రాడ్‌ను సాంత్వన పరిచాడు. ఒకరకంగా క్షమాపణ కూడా చెప్పాడు. ఆ ఆరు సిక్సర్ల విధ్వంసాన్ని లైట్ తేసుకుని క్రికెట్‌లో ముందుకు సాగమని సలహా ఇచ్చాడు కూడా. కానీ సోషల్ మీడియా మాత్రం ఆనాటి ఘటనను అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆనాటి ఘటన మళ్లీ పునరావృతం కావడం అసంభవం, అసాధ్యమే అయినప్పటికీ, బ్రాడ్‌ను అంత తేలిగ్గా తీసిపడేయడం ఇప్పుడు సాధ్యపడనప్పటికీ యువరాజ్ పట్ల క్రేజీ బ్రాడ్ పట్ల సానుభూతిగా, అపహాస్యంగా మారి ట్లీట్లు వరదలెత్తుతున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ గుడ్‌బై చెప్పగానే యువీని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? భార్య అదృష్టమేమీ లేదట!