Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే ఒక్కడు : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ఒకే ఒక్కడు : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
, సోమవారం, 11 నవంబరు 2019 (19:52 IST)
భారత ట్వంటీ20 క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకుల పట్టికలో టెస్ట్, వన్డే, ట్వంటీ20 ఫార్మెట్‌ మూడింటిలోనూ టాప్-10లో చోటుదక్కించుకున్నాడు. ఇలా మూడు ఫార్మెట్‌లలో చోటుదక్కించుకున్న ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫలితంగా రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. 
 
ఐసీసీ తాజాగా సోమవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో రోహిత్‌శర్మ 677 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఫలితంగా టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ మూడింటిలోనూ టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 863 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న రోహిత్, టెస్టుల్లో 722 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. తాజాగా, టీ20లో ఏడో స్థానంలో నిలిచాడు.
 
అలాగే, రోహిత్ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20లో త్రుటిలో సెంచరీ మిస్సయిన రోహిత్.. ఈ సిరీస్‌లో మొత్తం 96 పరుగులు చేశాడు. 
 
అదేవిధంగా నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ రెండు సిక్సర్లు బాది ఉంటే 400 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కి ఉండేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 534 సిక్సర్లతో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉండగా, పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ చిత్తు... భారత్ ఖాతాలో ట్వంటీ20 సిరీస్