Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌ను కట్టడి చేసిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితం

Advertiesment
india vs england
, ఆదివారం, 29 అక్టోబరు 2023 (18:29 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 230 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత ఆటగాళ్ళలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మాత్రమే రాణించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, మిగిలిన ఆటగాళ్ళు రెండు అంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ 87, కేఎల్ రాహుల్ 39, సూర్య కుమార్‌లు 49 చొప్పున పరుగులు చేయగా, కోహ్లీ 0, గిల్ 9, శ్రేయాస్ అయ్యర్ 4, జడేజా 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. గత మ్యాచ్‌లలో దారుణ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2, మార్క్ ఉడ్ ఒక్కో వికెట్ చొప్పున తీసి భారత్ వెన్ను విరిచారు. 
 
లక్నో పిచ్‌పై బౌన్స్, కొద్దిగా స్వింగ్ లభించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని అద్భుతంగా రాణించారు. బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ పదునైన బంతులు విసరడంతో అది సాధ్యం కాలేదు. అదేసమయంలో ఇంగ్లండ్ ఫీల్డింగ్ కూడా మెరుగు పడటంతో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్ : కష్టాల్లో భారత్.. నాలుగు వికెట్లు ఢమాల్