Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : భారత్‌కు బ్యాడ్ న్యూస్... రోహిత్ దూరం??

dravid - rohith
, ఆదివారం, 29 అక్టోబరు 2023 (10:08 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగునుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌, ఐదు అప్రహిత విజయాలతో ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోని భారత్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత్‌కు చేదు వార్త ఒకటి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ కుడిచేతి మణికట్టుుక బంతి బలంగా తాకింది. ఇది భారత శిబిరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఈ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 
 
ఇంగ్లండ్‌తో మరికొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ ఆరంభంకానున్న నేపథ్యంలో అటు టీమ్‌తోపాటు ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగించేలా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ గాయపడ్డట్టు సమాచారం. కుడిచేయి మణికట్టుకు బంతి బలంగా తాకిందని 'ఇన్‌స్పైడర్ స్పోర్ట్' రిపోర్ట్ పేర్కొంది. ఫిజియో వెంటనే స్పందించారని తెలిపింది. రోహిత్ గాయం టీమిండియా శిబిరంలో ఆందోళనలు రేకెత్తిస్తోందని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత అనేది తెలియరాలేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. దీంతో రోహిత్‌కు పెద్ద గాయమే అయ్యిందా, ఇంగ్లండ్‌పై మ్యాచ్ ఆడతాడా లేదా అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
 
మరోవైపు, లక్నో వేదికగా జరిగే భారత్ వర్సె ఇంగ్లండ్ మ్యాచ్ రోహిత్ శర్మకు కీలకమైన మైలురాయికానుంది. ఈ మ్యాచ్ ఆడితే టీమిండియా కెప్టెన్‌గా 100వ మ్యాచ్ అవుతుంది. అంతేకాదు.. అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి రోహిత్ ఇంకా 47 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాణిస్తే దిగ్గజ ఆటగాళ్ల సరసన రోహిత్ కూడా చోటుదక్కించుకుంటారు. మరోవైపు ప్రస్తుత ప్రపంచ కప్‌లో రోహిత్ అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో  62.20 సగటుతో 311 పరుగులు సాధించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఆస్ట్రేలియా... వరుసగా 3 మ్యాచుల్లో 350+ పరుగులు