Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ రోత.. గంభీర్.. ఢిల్లీ సర్కారుపై ఫైర్.. చికెన్ గున్యూ, డెంగ్యూ వ్యాధులొస్తే స్టడీ టూర్ వెళ్తారా?

భారత క్రికెటర్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ ద్వారా పాకిస్తాన్‌ను ఏకిపారేశాడు. పాకిస్థాన్‌పై మండిపడ్డాడు. భారత్ సంయమనం పాటిస్తుంటే.. పాకిస్థాన్ రోతను ప్రదర్శిస్తుందని ట్వీట్ చేశాడు. జమ్మూకశ్మీర్‌లో ఉ

పాకిస్థాన్ రోత.. గంభీర్.. ఢిల్లీ సర్కారుపై ఫైర్.. చికెన్ గున్యూ, డెంగ్యూ వ్యాధులొస్తే స్టడీ టూర్ వెళ్తారా?
, ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (16:06 IST)
భారత క్రికెటర్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ ద్వారా పాకిస్తాన్‌ను ఏకిపారేశాడు. పాకిస్థాన్‌పై మండిపడ్డాడు. భారత్ సంయమనం పాటిస్తుంటే.. పాకిస్థాన్ రోతను ప్రదర్శిస్తుందని ట్వీట్ చేశాడు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో జవాన్లు మృతి చెందడాన్ని గంభీర్ తీవ్రంగా ఖండించాడు. మన జవాన్లు చనిపోతే వాళ్లు ఖండిస్తారు, అంతే ఇంకేమీ ఉండదు అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మనం పరిష్కారం కోసం ముందుకొస్తుంటే.. పాకిస్థాన్ బుల్లెట్లతో యాన్సర్ ఇస్తుందన్నారు.  
 
కాగా జమ్మూ బారాముల్లలోని యూరీ సెక్టార్‌లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉదయం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్‌కౌంటర్‌ నలుగురు ఉగ్రవాదులు హతమైనారు.
 
మరోవైపు ఢిల్లీ సర్కారుపైనా గంభీర్ మండిపడ్డాడు. ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతోన్న నేపథ్యంలో.. ప్రజలంతా జ్వరాలతో అల్లాడుతున్న సమయంలో అండగా ఉండాల్సిన నేతలు, విదేశీ పర్యటనలకు వెళ్లడంపై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ప్రజలు చనిపోతుంటే పాలకులు స్టడీ టూర్ పేరిట విదేశాల్లో ఉండటం, పరిస్థితి తీవ్రత తెలిసినా కూడా వెంటనే భారత్‌కు రాకపోవడం దురదృష్టకరమన్నాడు.
 
పాఠశాలలు ఎంతకాలమైనా వేచి ఉంటాయని మృత్యువు వేచి చూడదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజకీయ ఆరోపణలు చేస్తూ బంతిని ఒకరి కోర్టు నుంచి మరొకరి కోర్టుల్లోకి నెట్టుకోకుండా, పరిపాలనలో నిమగ్నమై, ప్రజల ఇబ్బందులను తొలగించాలని సలహా ఇచ్చాడు. చికున్ గున్యా పీడిస్తున్న సమయంలో చాలినంత మంది ఏఏపీ నేతలు విధుల్లో లేకపోవడం బాధాకరమన్నాడు. గంభీర్ ట్వీట్లకు గంటల్లోనే వేలాది రీట్వీట్లు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార ఒలింపిక్ విజేత దీపా మాలిక్‌కు రూ.4 కోట్లు.. ఉద్యోగం : హర్యానా ప్రభుత్వం