Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిలక్ వర్మ అర్థ సెంచరీ-టీషర్ట్ పైకెత్తి టాటూను చూపిస్తూ సంబరాలు?

Advertiesment
Tilak Varma
, శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:28 IST)
Tilak Varma
బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. సాయి కిశోర్ మూడు వికెట్లు తీయగా.. సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, షెహ్‌బాజ్ తలో వికెట్ పడగొట్టారు. 
 
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా నాకౌట్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ బాదిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. 
 
ఈ సందర్భంగా అద్భుతమైన మూమెంట్ చోటుచేసుకుంది. తిలక్ వర్మ అర్థ సెంచరీ సాధించిన అనంతరం తన టీషర్ట్ పైకెత్తి టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. 
 
తిలక్ వర్మ సంబరాలు ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు, సహచర ఆటగాళ్లకు వింతగా అనిపించాయి. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై తిలక్ వర్మను వివరణ కోరగా.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం అలా సంబరాలు చేసుకున్నానని అతను స్పష్టం చేశాడు. 
 
ఈ హాఫ్ సెంచరీ తన తల్లితో పాటు రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమని వివరించాడు. క్రికెట్‌లో వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి అర్థ శతకం సాధించినా, జట్టు విజయం కావాల్సిన పరుగులు కొట్టినా.. తన శరీరంపై ఉన్న టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకుంటానని మా అమ్మకు మాట ఇచ్చాను. అందుకే హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే మా అమ్మ టాటూ చూపిస్తూ సంబరాలు జరుపుకున్నానని వివరణ ఇచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియాకు గట్టి దెబ్బ: శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ ఫీవర్