Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిరీస్ సమం: బర్మింగ్ హామ్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. భారత్‌కు చుక్కలు

England
, మంగళవారం, 5 జులై 2022 (17:28 IST)
England
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య  ఐదో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ 76.4 ఓవర్లలో లాగించేసింది. 
 
కరోనా కలకలం కారణంగా చివరి టెస్టును రీషెడ్యూల్ చేసి తాజాగా బర్మింగ్ హామ్‌లో నిర్వహించారు. 
 
ఈ టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టే విజేతగా నిలిచింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఉతికిపారేసింది. స్టార్ ఆటగాళ్లు జో రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. టీమిండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. 
 
నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడును అడ్డుకుని మూడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లను రూట్, బెయిర్ స్టో సమర్థంగా ఎదుర్కొన్నారు. 
 
మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆట ముగించిన ఈ జోడీ, ఐదో రోజు వేగంగా పనిపూర్తిచేసింది. దాంతో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 
 
ఈ మ్యాచ్ లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుందామని ఆశించిన టీమిండియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ గెలిచే అవకాశం ఉండగా, ఇంగ్లండ్ జట్టు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ