Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబ్బులిస్తేనే క్రికెట్ ఆడతాం... హీరోలుగా కీర్తించవద్దు.. రైతే నిజమైన హీరో : బంగ్లా కెప్టెన్ మోర్తజా

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఫిలాసఫర్ అయిన మష్రాఫే మోర్తజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవం కూడా. డబ్బులిస్తేనే తాము క్రికెట్ ఆడతామని అందువల్ల తమను హీరోలుగా కీర్తించవద్

డబ్బులిస్తేనే క్రికెట్ ఆడతాం... హీరోలుగా కీర్తించవద్దు.. రైతే నిజమైన హీరో : బంగ్లా కెప్టెన్ మోర్తజా
, మంగళవారం, 20 జూన్ 2017 (12:53 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఫిలాసఫర్ అయిన మష్రాఫే మోర్తజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవం కూడా. డబ్బులిస్తేనే తాము క్రికెట్ ఆడతామని అందువల్ల తమను హీరోలుగా కీర్తించవద్దని ఆయన విన్నవించాడు. 
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ.. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేమీ లేదని... తమను హీరోలుగా, స్టార్లుగా కీర్తించవద్దని కోరాడు. డబ్బులు ఇస్తేనే తాము క్రికెట్ ఆడుతామని... ఈ నేపథ్యంలో క్రికెట్‌కు, దేశ భక్తికి ముడిపెట్టవద్దని చెప్పాడు. ఏ దేశంలోనైనా నిజమైన హీరోలు రైతులేనని తెలిపాడు. పొలంలో పంటలు పండించే రైతులు, దేశ గోడలను నిర్మించే శ్రామికులు, ప్రాణాలను కాపాడే డాక్టర్లే నిజమైన హీరోలని చెప్పాడు.
 
క్రికెటర్లుగా తాము చేస్తున్నది ఏమీ లేదని... కనీసం ఒక ఇటుకను కూడా తయారు చేయలేమని మోర్తాజా గుర్తు చేశాడు. శ్రామికులైతే దేశాన్నే నిర్మిస్తారని కితాబిచ్చాడు. నిజం చెప్పాలంటే, ఒక యాక్టర్, ఒక సింగర్ ఏం చేస్తాడో... తాము కూడా అదే చేస్తున్నామన్నాడు. డబ్బు తీసుకుని, క్రికెట్ ఆడతామన్నాడు. 
 
దేశ భక్తి గురించి మాట్లాడేవారంతా, దేశం కోసం ఆలోచించాలని సూచించాడు. రోడ్ల మీద చెత్త వేయడం, వీధుల్లో ఉమ్మి వేయడం, ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోవడం వంటివి అందరూ మానుకోవాలని, అప్పుడే దేశం కొంచెం మారుతుందని చెప్పాడు. దేశం కోసం నిజాయతీగా పని చేయడమే, నిజమైన దేశభక్తి అని తెలిపాడు. క్రికెట్‌తో ముడిపడిన దేశభక్తి ఏమిటో తనకు ఇంతవరకు అర్థం కాలేదని మోర్తాజా అన్నాడు. 
 
కాగా, తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్ వరకు వచ్చిన విషయం తెల్సిందే. సెమీస్‌లో భారత జట్టుతో తలపడి ఓడిపోయి ఇంటికి చేరుకుంది. ఆ జట్టు స్వదేశానికి వెళ్లిన తర్వాత మోర్తాజా పై విధంగా వ్యాఖ్యానించడం, ఇతర క్రికెటర్లు కూడా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త వ్యూహంతో జట్టును చిత్తుగా ఓడించిన కోహ్లీ : నెటిజన్ల మండిపాటు.. నేను సిగ్గపడలేదన్న విరాట్