Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెత్త వ్యూహంతో జట్టును చిత్తుగా ఓడించిన కోహ్లీ : నెటిజన్ల మండిపాటు.. నేను సిగ్గపడలేదన్న విరాట్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో దేశంలో టీవీలు పగిలాయి. భారత క్రికెట్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్

చెత్త వ్యూహంతో జట్టును చిత్తుగా ఓడించిన కోహ్లీ : నెటిజన్ల మండిపాటు.. నేను సిగ్గపడలేదన్న విరాట్
, మంగళవారం, 20 జూన్ 2017 (10:59 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో దేశంలో టీవీలు పగిలాయి. భారత క్రికెట్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో అద్భుతమైన అవకాశాన్ని చెత్తవ్యూహంతో కోహ్లీ నాశనం చేశాడని మండిపడుతున్నారు. అసలు ఫైనల్‌కు ఏ వ్యూహంతో కోహ్లీ సిద్ధమయ్యాడని నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 
 
పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సలహాను పాకిస్థాన్ ఆచరణలోకి తీసుకొచ్చి విజయం సాధించింది. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకోవాలంటూ ఇమ్రాన్ ఇచ్చిన సలహాను పాకిస్తాన్ కెప్టెన్ సర్పరాజ్ ఫాలో అయ్యాడు. కానీ కోహ్లీ మాత్రం ఎలాంటి వ్యూహం లేకుండా చిరకాల ప్రత్యర్థితో ఎలా బరిలోకి దిగాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
 
ఫైనల్‌లో ఫ్లాట్ పిచ్‌పై ఇప్పటిదాకా రాణించలేని అశ్విన్‌ను జట్టులోకి ఎందుకు కోహ్లీ తీసుకున్నాడని అడుగుతున్నాకు. బుమ్రా వరుసగా ఎక్స్‌ట్రాలు ఇస్తున్నప్పుడు స్పెల్ ఎందుకు మార్చలేదని అడుగుతున్నారు. ఫీల్డింగ్ మోహరింపు కూడా సమర్థవంతంగా లేదని, బ్యాటింగ్‌లో వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నట్టు కనిపించలేదని. ఎలా చూసినా టీమిండియా ఆటగాళ్ల ఆటతీరు ఏమాత్రం బాగోలేదని.. వైఫల్యాన్ని జట్టు వైఫల్యం అనేకంటే కోహ్లీ వైఫల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లు అంటున్నారు. 
 
కానీ జట్టు ఓటమికి కెప్టెనే కారణమని చెప్తున్న వారికి  కోహ్లీ కౌంటరిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును ఫైనల్ చేర్చే వరకు కష్టపడ్డామన్నాడు. ఫైనల్‌లో తమ ఆటతీరు అత్యుత్తమంగా లేదని అంగీకరించేందుకు తానేమీ సిగ్గుపడటం లేదని అన్నాడు. సమష్టి వైఫల్యమే ఇందుకు కారణమని అన్నాడు. 
 
ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, అతను ఆడుతుంటే, లక్ష్యానికి దగ్గరగా వెళ్లగలమన్న నమ్మకం కూడా కలిగిందని, ఒత్తిడి మధ్య పొరపాట్లు సహజమని, అటువంటి పొరపాటే హార్దిక్‌ను రనౌట్ రూపంలో పెవీలియన్‌కు పంపిందన్నాడు. ఫైనల్‌కు సిద్ధం చేసిన పిచ్, స్పిన్నర్లకు సహకరిస్తుందనే ఇద్దరిని తీసుకున్నామని చెప్పాడు.
 
అయితే, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో స్పిన్నర్లకు పెద్ద సవాల్ ఎదురైందని అన్నాడు. భవిష్యత్తులోనూ ఇదే జట్టు కొనసాగుతుందని, తప్పులను సవరించుకుని మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ పట్టుదలకు తలొగ్గి కుంబ్లేని తప్పిస్తే రేపు మరొక కోచ్ పరిస్థితి ఏమిటి? బీసీసీఐ మల్లగుల్లాలు