Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపక్ హుడా ప్రపంచ అరుదైన రికార్డు.. టీమిండియాకు విజయపరంపర

Advertiesment
Huda
, ఆదివారం, 21 ఆగస్టు 2022 (11:06 IST)
Huda
టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులతో పాటు ఒక వికెట్‌ పడగొట్టాడు. దాంతో, ఈ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0 తో సొంతం చేసుకుంది. 
 
ఈ విజయంతో దీపక్ హుడా ఓ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. 
 
హుడా ఇప్పటి వరకు 9 టీ20లు, 7వన్డేల్లో పోటీ పడ్డాడు. వీటిలో టీమిండియా గెలిచింది. దాంతో అం‍తర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 16 విజయాలు సాధించిన ఆటగాడిగా హుడా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరారే వన్డే మ్యాచ్ : 161 రన్స్‌కు కుప్పకూలిన జింబాబ్వే