Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం.. కేకేఆర్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు

Advertiesment
ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం.. కేకేఆర్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (23:11 IST)
Delhi Capitals
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన ఏకపక్ష మ్యాచ్‌‌లో పృథ్వీ షా(38 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. పృథ్వీ షా 82, ధావన్‌ 46 ఊచకోతతో సునాయసంగా విజయం ముంగిట నిలిచింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. బర్త్‌డే బాయ్ ఆండ్రీ రస్సెల్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 నాటౌట్), శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు.
 
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. పృథ్వీ షాకు తోడుగా శిఖర్ ధావన్(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ విజయం సులువైంది. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాచ్ కోసం పక్కకి డైవ్ చేసిన ధోనీ.. బంతి చేతుల్లో పడినా..? (video)