బాహుబలి చిత్రంలో నటించాలని ఉందన్న ఆసీస్ క్రికెటర్..

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:44 IST)
క్రికెట్‌లో కొండంత లక్ష్యాన్ని కూడా చాలా సునాయాసంగా చేధించడంలో దిట్ట ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇతగాడు కొన్నాళ్లు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిషేధానికి గురయ్యాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. అయితే ఈ ఏడాది మాత్రం మళ్లీ హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ తరపున ఆడుతున్నాడు. తాజాగా వార్నర్ ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యాడు. 
 
ఈ సందర్భంగా ఓ విలేకరి వార్నర్‌ని ఉద్దేశించి ఇలా ప్రశ్నించారు..మీరు ఒకవేళ నటించాల్సి వస్తే ఏ తెలుగు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతారు అని అడిగారు. దీనికి వెంట‌నే వార్న‌ర్ బాహుబ‌లి అని స‌మాధానం ఇచ్చాడు. బాహుబ‌లి చిత్రానికి సీక్వెల్‌గా మూడో పార్ట్ తెరకెక్కితే అందులో న‌టించేందుకు నేను సిద్ధం అని వార్న‌ర్ అన్నాడు.
 
దర్శకధీరుడు రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్‌ బాహుబ‌లి చిత్రం విడుద‌లై రెండు సంవత్సరాలు గడుస్తూన్నా ఈ మూవీ మానియా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఆ మ‌ధ్య ‘అవెంజర్స్‌’లో నిక్‌ ఫ్యూరీ పాత్ర పోషించిన హాలీవుడ్ న‌టుడు జాక్సన్ కూడా త‌న‌కి బాహుబ‌లి 3 చిత్రంలో న‌టించాల‌ని ఉందని తన కోరిక‌ను వ్య‌క్త ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హార్దిక్ పాండ్యా, రాహుల్‌కి నోటీసులు.. ఎందుకంటే.?