Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

క్రిస్ గేల్‌కు షాకిచ్చిన కుర్ర బౌలర్.. బ్యాట్ ముక్కలైంది.. (వీడియో వైరల్)

Advertiesment
Batting
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:03 IST)
క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే బౌలర్లకు పట్టపగలే చుక్కుల చూపించగల సమర్థుడు. ఒక్కసారి బ్యాటింగ్ స్టార్ట్ చేశాక ఆపడం ఎవరితరం కాదు. అలాంటి క్రిస్ గేల్‌ను షాక్ గురిచేశాడు ఓ కుర్ర బౌలర్. తన బోలింగ్ వేగానికి క్రిస్ గేల్ బ్యాట్ ముక్కలైంది. 
 
సీపీఎల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సీపీఎల్‌ 2021లో భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెంట్‌ కిట్స్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. సెంట్‌ కిట్స్‌ తరుపు నుంచి గేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గయానా అమెజాన్‌ వారియర్స్ తరుపు నుంచి ఒడియన్ స్మిత్ బౌలింగ్ చేస్తున్నాడు. 4వ ఓవర్‌లో స్మిత్ తన రెండో బంతిని లెగ్‌స్టంప్ వైపు వేశాడు. ఈ బాల్‌ను గేల్‌ ఆఫ్‌సైడ్‌ ఆడుదామని భావించాడు.
 
అయితే బంతి బ్యాట్‌కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్‌ కింద పడిపోగా.. హ్యాండిల్ మాత్రం గేల్‌ చేతిలో ఉండిపోయింది. ఒక్క నిమిషంపాటు గేల్ ఏం జరిగిందో చూసి మళ్లీ.. కొత్త బ్యాట్ తెప్పించుకొని బ్యాటింగ్ చేశాడు.
 
ఈ మ్యాచ్‌లో సెంట్‌ కిట్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్పై గెలుపొందింది. గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్‌ కిట్స్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 42 (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేశారు. లూయిస్ 77 (3 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేసి మ్యాచ్‌ను గెలింపిచారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ క్రికెట్‌కు లసిత్‌ మలింగ బైబై