వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే క్రిస్ గేల్ ఓ అభిమానితో డేటింగ్ సై అంటూ ట్విట్టర్ ద్వారా ఓకే చెప్పేశాడు. అయితే క్రిస్ గేల్ ఓ ఫ్యాన్‌తో డేటింగ్ చేసేందుకు ఓకే అన్నాడా..? ఆయనకు పెళ్ళైపోయిందిగా.. ఓ పాపకు తండ్రైన అతడు మరో ఫ్యాన్‌తో డేటింగ్ చేసేందుకు ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం మీలో కలిగిందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఆరోహి క్రిస్ గేల్‌కి వీరాభిమాని. సోషల్ మీడియా చాట్ సందర్భంగా ఆరోహి.. గేల్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ.. డేట్‌కి వెళ్దామా? అని ప్రశ్నించింది. వెంటనే గేల్ "నువ్వు బిల్లు కడతానంటే నేను రెడీ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే గేల్ కండిషన్‌కు ఓకే చెప్పేసిన ఆరోహి.. అతడికీ ఓ షరతు పెట్టింది. తాను డేటింగ్‌కు రావాలంటే.. ముందు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మ్యాచ్‌లో నువ్వు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున శతకం కొట్టాలని ట్వీట్ చేసింది. మరి ఫ్యాన్ సెంచరీ అడిగింది కదా గేల్ సెంచరీ కొడతాడో లేకుంటే డేటింగ్ ఆలోచనను విరమించుకుంటాడో తెలియాలంటే వేచిచూడాల్సిందే.